

మనన్యూస్,నాగోల్:గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన తేనేటి విందుకు ఆహ్వానం మేరకు వృక్షజీవి డాక్టర్ మార్కండేయులు హాజరవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ గవర్నర్ గౌరవనీయులు సుధా జిష్ణు దేవ్ వర్మాజీ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని తెలంగాణ మంత్రి వర్గం ని మర్యాదపూర్వకంగా కలిసి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ డాక్టర్ మార్కండేయులు వృత్తిరీత్యా వైద్యంతోపాటు పర్యావరణ పరిరక్షణ మీద చేస్తున్న సేవ ఎంతో విలువైనదని,వారూ చేస్తున్న సేవలను గుర్తు చేస్తూ వారికి అభినందనలు తెలిపారు.