ప్రత్తిపాడు పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు,
కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రత్తిపాడు సిఐ బి.ఎస్ అప్పారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు ఎస్ఐ ఎస్ లక్ష్మీకాంతం నేతృత్వంలో నిర్వహించిన గ్రామీణ సాంప్రదాయ క్రీడ పోటీలను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ,పెద్దాపురం డిఎస్పి శ్రీహరి రాజు ముఖ్య అతిథిలుగా హాజరై పోటీలను ప్రారంభించారు. పెద్దాపురం డిఎస్పి శ్రీహరి రాజు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటుచేసిన సిఐ బిఎస్ అప్పారావు, ఎస్సై లక్ష్మీకాంతంలని అభినందించారు.ఎమ్మెల్యే శ వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న తరుణంలో పోలీసు వారి ఏర్పాటుచేసిన సాంప్రదాయక క్రీడలు జరిపించినందుకు ప్రత్తిపాడు సీఐ,ఎస్ఐలను ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ అభినందించారు.క్రీడా పోటీలకు ఓటమి ఉండదని ఒకసారి విజయం సాధించడం మరోసారి అపజయం పొందడం పరిపాటి అని అది నిజ జీవితంలో కూడా వర్తిస్తుందని ఓటమి చెందినా మరోసారి మళ్లీ విజయంతో ముందుకు సాగుతామని అన్నారు.ప్రతి ఒక్కరు గ్రామీణ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని సంక్రాంతి సందర్భంలో జూదాలు,కోడి పందాలు ప్రోత్సహించకుండా ఇంతటి చక్కటి వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు.ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మికాంతం మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా యువత అందరూ గ్రామీణ సాంప్రదాయ క్రీడల్లో పాల్గొనాలని పేకాట, గుండాట,కోడిపందాలు వంటి జూదానికి దూరంగా ఉండాలని, ఈ కబడ్డి ఆటకి 7 టీమ్స్ ప్రత్తిపాడు మండలంలో ప్రత్తిపాడు 2 టీంలు,రాచపల్లి, ధర్మవరం,ఏలూరు,గజ్జనపూడి, టి.రాయవరం నుండి పాల్గొనడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్నా శివ,బస్సా మహాలక్ష్మి ప్రసాద్,మాజీ ఎంపీటీసీ మైరాల కనకారావు, మండల నాయకులు,సర్పంచులు, ఎంపీటీసీలు,పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు,యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..