

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:రానున్న పండుగ పర్వదినాలు పురస్కరించుకుని నిర్వహించిన దాడుల్లో 160 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డి ఎస్ పి డి శ్రీహరి రాజు ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వాధీనం చేసుకున్న కోడి కత్తులను, నిందితుడిని విలేకరుల ముందు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడిపందాలు, గుండాట, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగ పర్వదినాలను ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని ఆయన సూచించారు. కోడిపందాలు జుదాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ప్రతిపాడు సీఐ బి సూర్య అప్పారావు, ఏలేశ్వరం ఎస్సై ఎన్ రామలింగేశ్వర రావు ఉన్నారు.