- 92వ వార్డు కార్పొరేటర్ గొందేశి శ్రీదేవి,రామిరెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు…
గాజువాక మన ద్యాస ప్రతినిధి నవంబర్ 21: పెద్ద గంట్యాడ మండలం 92 వ వార్డులో సాయి బాబా గుడి దగ్గర చాలా రోజులుగా వెలగని స్ట్రీట్ లైట్ వార్డ్ కార్పొరేటర్ చొరవతో ఎట్టకేలకు లైట్లు వెలిగాయి. నిత్యం గుడి సమీపంలో వేలాది మంది భక్తులు దర్శనార్థం రావడం వీధిలైట్లు లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందికరంగా గుడి దగ్గరికి వెళ్లడం కష్టమవుతుంది. ఈ సమస్య పట్ల జీవీఎంసీ 92 వ వార్డు కార్పొరేటర్ బొందేసి శ్రీదేవి రామిరెడ్డి దంపతులకు గ్రామ ప్రజలు ఈ విషయం తెలియజేసిన వెంటనే సమస్యల మీద స్పందిస్తూ స్థానిక కార్పొరేటర్ జీవీఎంసీ ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరితగతిన వీధి దీపాల వెలిగించే విధంగా చర్యలు చేపట్టారు. ఎన్నికలలో ఏదైతే ప్రజలు కు హామీ ఇచ్చిన విధంగా 92వ వార్డ్ కార్పొరేటర్ గొందేసి శ్రీదేవి,రామిరెడ్డి దంపతులు ప్రతి సమస్యను కూడా తెలుసుకుని త్వరితగతిన పనులు చేయించి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.