కలిగిరి, నవంబర్ 19, మన ధ్యాస RC ఇంచార్జి నాగరాజు:

కలిగిరి మండల అధ్యక్షులుగా తెల్లపాడు ఎంపీటీసీ సభ్యులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ నెల 5న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 13 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో ఘన విజయం సాధించి, వైసీపీ 4 స్థానాలకు పరిమితమైంది.ఈ నేపథ్యంలో నిన్న కలిగిరి ఎంపీడీవో కార్యాలయంలో మండలాధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఘనంగా జరిగింది. కలిగిరి మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి. శివప్రసాద్ 13 మంది ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, అనంతరం అధ్యక్ష ఎన్నిక కోసం సభ్యులచేత చేతులెత్తించారు. ఇందులో 8 మంది సభ్యుల మద్దతుతో తెల్లపాడు ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచిన బిజ్జం కృష్ణారెడ్డిని మండలాధ్యక్షులుగా ఆర్వో అధికారికంగా ప్రకటించారు.అదే క్రమంలో ఉపాధ్యక్షురాలిగా క్రిష్ణారెడ్డి పాలెం ఎంపీటీసీ అభ్యర్థి తోకల యమున 8 మంది సభ్యుల మద్దతుతో ఎన్నికయ్యారు.ఘనంగా సన్మానం – హాజరైన ప్రముఖులు:ఈ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ విచ్చేసి, నూతనంగా ఎన్నికైన ఎంపీపీ బిజ్జం వెంకట కృష్ణారెడ్డిని శాలువా కప్పి, పూల బొకేతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ *మెట్టుకూరు చిరంజీవిరెడ్డి *, మాజీ మండలాధ్యక్షురాలు, నూతన జడ్పీటీసీ సభ్యురాలు *మెట్టుకూరు శిరీషారెడ్డి *, మండల తెలుగుదేశం అధ్యక్షులు *పూసాల వెంగప నాయుడు * తదితర ముఖ్య నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం నూతన ఎంపీపీ బిజ్జం కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి, సీఎం చంద్రబాబు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో మండలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రత్యూష , ఎస్ఐ లతీఫున్నిసా గారు, పోలీస్ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
