రేణిగుంట (తిరుపతి):
భారతీయ మజ్దూర్ సంఘ్ ( బి ఎం ఎస్ ) వ్యవస్థాపకులు దత్తంగేజి (దత్తెపంథ్ ఠెంగ్డీ) పుణ్యతిథి సందర్భంగా తిరుపతి జిల్లా రేణిగుంట గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులను కలిసి వారికి పండ్లు, పలహారాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బి.ఎం.ఎస్. తిరుపతి జిల్లా కార్యదర్శి పూల వెంకటాద్రి యాదవ్ మాట్లాడుతూ, సమాజ ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అపారమైనవని కొనియాడారు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న ఈ శ్రామిక సోదరుల సంక్షేమం పట్ల కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు:
కనీస వేతనం పెంపు: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులకు తక్షణమే కనీస వేతనం రూ. 25,000/- మంజూరు చేయాలి.
సొంత ఇంటి కల నెరవేర్చాలి: రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న కార్మికులందరికీ సొంత ఇల్లు లేదా నివేదన స్థలాలు కేటాయించాలి.
పిల్లలకు ఉచిత విద్య: కార్మికుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత చదువుల వరకు ఉచిత విద్యను అందించాలి.
దత్తంగేజి చూపిన బాటలో కార్మికుల హక్కుల సాధన కోసం బి ఎం ఎస్ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు బి ఎం ఎస్ స్థానిక నాయకులు, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


