కలిగిరి నవంబర్ 9 మన ద్యాస ప్రతినిధి శ్రీకాంత్ కుట్టుబోయిన

కలిగిరిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి మోటార్ బైక్ ఢీకొనడంతో మాణిక్యాల మనీ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కుమారుడు ఆదికి స్వల్ప గాయాలయ్యాయి.వివరాల్లోకి వెళితే.. ముత్తుకూరు మండలం గోళ్ళపాలెం గ్రామానికి చెందిన మాణిక్యాల మనీ కమ్మవారిపాలెంలోని ఓ గొర్రెల ఫామ్‌లో పనిచేస్తున్నాడు. కలిగిరి పొగాకు వేలం కేంద్రానికి పొగాకు బేళ్లను తీసుకువస్తున్న ట్రాక్టర్‌లో ఆయిల్ అయిపోవడంతో డ్రైవర్ దానిని ప్రధాన రహదారి పక్కన నిలిపి ఉంచాడు.అదే సమయంలో మనీ తన కుమారుడు ఆదిని మోటార్ బైక్‌పై ఎక్కించుకుని కలిగిరి వైపు వస్తుండగా, రహదారి పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రక్కుకు తెరిచి ఉన్న డోర్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మనీ తీవ్రంగా గాయపడగా, ఆయన కుమారుడు ఆదికి స్వల్ప గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన మనీని మెరుగైన వైద్యం కోసం వింజమూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *