ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం. నాగరాజు
గోపాలపట్నం మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 9: ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా,కోలాహలంగా జరిగాయి. విశాఖపట్నం జిల్లాలో నిర్వహించిన ఈ వేడుకల్లో అసోసియేషన్ సభ్యులు, రిపోర్టర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం.నాగరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రిపోర్టర్లందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇలాగే దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి రిపోర్టర్ అసోసియేషన్ అభివృద్ధికి, కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తే భవిష్యత్తులో పండుగలను మరింత వైభవంగా నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు.ఈ వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రిపోర్టర్లకు, ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు మరియు ప్రజలందరికీ ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.