కలిగిరి, నవంబర్ 5 (మన నెల్లూరు, RC ఇన్చార్జి నాగరాజు):
కలిగిరి పాత బస్టాండ్ సమీపంలో నిమ్మ మొక్కల టాటా ఏసీకి ప్రమాదం తప్పింది.
నెల్లూరు జిల్లా కలిగిరిలో నరసరావు పేట, రైల్వే కోడూరు నుండి నిమ్మ మొక్కల లోడుతో వింజమూరు వైపు వెళ్తున్న టాటా ఏసీ బండి కలిగిరి పాత బస్టాండ్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. మద్యం మత్తులో వేగంగా వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఢీతో టాటా ఏసీ ముందు టైర్ పగిలిపోయింది ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.ఈ ఘటనలో డ్రైవర్‌కు, పక్కనే ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పడంతో ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. టాటా ఏసీలో ఉన్న డ్రైవర్ మరియు మరో ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు.డ్రైవింగ్ చేసిన వ్యక్తి నరసరావుపేటకు చెందిన వాడిగా, పక్కన ఉన్న వ్యక్తి రైల్వే కోడూరుకు చెందిన వాడిగా స్థానికులు తెలిపారు.
