- కూటమి సహకారం ప్రజల అభిమానం మరువలేనిది….
- ఐదవ సారి కార్పోరేటర్ గా ఘనవిజయం…
- అభిమానుల కోలాహలం – ప్రజల దీవెనల గంధం విజయం…
గాజువాక మన ద్యాస ప్రతినిధి నవంబర్ 7: స్థానిక సంస్థల ఎన్నికలలో 96వ వార్డు కూటమి అభ్యర్థి గంధం శ్రీనివాసరావు కార్పొరేటర్ గా ప్రజలు గెలిపించారు.పెద్ద గంట్యాడ మండలం నడుపూరు గ్రామం లో టిడిపి కార్యాలయం నుంచి 96వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు కూటమి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ప్రజలు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు అభిమానులు గజ మాలలతోనూ,సాలువలతోను సత్కరించారు.విజయోత్సవ ర్యాలీలో ప్రతి ఇంట ప్రతి చోట హారతులతో ఆయనకు స్వాగతం పలకడం జరిగింది.వందలాదిమంది పైగా ద్విచక్ర వాహనాలతో అభిమానుల నడుమ వార్డు నలుమూలలా కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ యాత్ర కొనసాగించారు.ఈ సందర్భంగా కూటమి తరుపున జనసేన నాయకులు రౌతు గోవింద్,ముమ్మన మురళి, బిజెపి నాయకులు కనకరాజు,భువనేశ్వరి మాట్లాడుతూ గత ఐదు సం|| అత్యధిక మెజార్టీతో కార్పొరేటర్ గా గెలుస్తున్నారు.ప్రజలు నమ్మకం ఏమిటంటే గంధం శ్రీనివాసరావు కార్పోరేటర్ కార్పొరేటర్ గా గెలిపించి కౌన్సిల్ సమావేశానికి అత్యధిక మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించి పంపించడం జరిగింది. వార్డులో నలుమూలలా కూడా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తక్షణ పరిష్కరించే నాయకుడు గంధం శ్రీనివాసరావు.వార్డ్ అభివృద్ధి ప్రజల శ్రేయస్సు ఆయనకు రెండు కళ్ళు లాంటివి. ప్రజలు పిలిచిన వెంటనే పలికే ప్రజా నాయకుడు నిత్యం ప్రజల అందుబాటులో ఉండే గంధం శ్రీనివాసరావు.నాయకుడిగా ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. గంధం శ్రీనివాసరావు కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో దిగితే ప్రత్యర్ధులు సాయశక్తిలా ప్రయత్నించినప్పటికీ ఆయన విజయాన్ని ఆపడం వారి తరం కాలేదు.ఐదవ సారి కూడా కార్పోరేటర్ గా గెలుపొందడం ప్రజల యొక్క అభిమానానికి చిహ్నం.ప్రజలకు ఇచ్చిన మాట తప్పని వ్యక్తిగా ప్రజలలో ఆయన పైన అభిమానం ప్రజల నమ్మకం ఎప్పుడు కూడా గంధం విజయ రహస్యం.96వ వార్డ్ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు,యువ నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్,రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలన విధానం ప్రజలకు ఎంతగానో నచ్చిందని స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కూటమి ప్రభుత్వం హవా కొనసాగింది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీని కూడా రెండు సంవత్సరాలలో పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్నిదని తెలపడం నాకు ఎంతో సంతోషం. ఐదుసార్లు ప్రజలు నన్ను నమ్మి కార్పోరేటర్ గా గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు.కార్పొరేటర్ గా గెలిచిన మరుక్షణం నుంచి కూడా ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో హామీ ప్రతిదీ కూడా నెరవేరుస్తానని అన్నారు.నిరుపేద కుటుంబంలో మరణించిన కుటుంబ సభ్యులకి నా సొంత నిధుల నుంచి దహన సంస్కారాన్ని కొంత సొమ్మును అందజేస్తామని తెలిపారు.96వ వార్డ్ లో ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ తొలగింపు పై ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపిన విధంగా ఐదు నెలల వ్యవధిలో తొలగిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తొలగించలేని పక్షంలో నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.ప్రజల సమస్యల పట్ల అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు.ప్రజలు ఎదుర్కొంటున్న మరొక సమస్య స్వతంత్ర నగర్, రిక్షా కాలనీలో ఇప్పటివరకు కూడా పట్టాలు లేకుండా జీవిస్తున్నారు.ఈ సమస్య పైన ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పట్టాలు ఇప్పించే విధంగా చర్యలు చేపడతానని తెలిపారు. వార్డులో వీధి దీపాలు,డ్రైనేజీ వ్యవస్థ,నీటి ఎద్దడిని, పారిశుద్ధ్య సమస్య, అవసరమైన చోట సీసీ రోడ్ల నిర్మాణం, వృద్ధులకు యువతకు ఓపెన్ జిమ్ సామాగ్రి ఏర్పాట్లు.ప్రతిదీ కూడా హామీ ప్రకారం నెరవేరుస్తానని తెలిపారు.ప్రత్యర్ధులు నా ఓటమి గురించి కులాల మధ్య చిచ్చు,స్టీల్ ప్లాంట్ లో పనిచేసిన కార్మికుల తొలగింపు పై దృష్ ప్రచారం చేశారు.ప్రజలు అవేవీ నమ్మకుండా వార్డు అభివృద్ధి చేసి చూపుతారు అనే విధంగా ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టారు.విశాఖ చరిత్రలో ఐదు సార్లు గెలిచిన కార్పొరేటర్ గా చరిత్రలో నిలిచే విధంగా ప్రజలు నన్ను ఆదరాబాణాలతో ఉంచడం చాలా సంతోషకరం.కూటమి ప్రభుత్వం ఆదేశిస్తే గనక నేను డిప్యూటీ మేయర్ గా కూడా చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సుధా, ఉగ్రం,నాగరాజు,బాసెట్టి అప్పారావు,నక్క రవణ కూటమి కార్యకర్తలు,అభిమానులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.