కాకర్ల సురేష్ నాయకత్వంలో కలిగిరి మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాం – గెలిచాక ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా – బిజ్జం ఖాజా కుమారి

కలిగిరి, నవంబర్ 2, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.

ఉదయగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. కలిగిరి మండలం అనంతపురం ఎంపీటీసీ పరిధిలోని పాతనాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం హోరెత్తుతోంది.టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి బిజ్జం ఖాజా కుమారి సోమవారం సాయంత్రం గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఉదయం నుండే ప్రచారo గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి గల్లీలో పర్యటించారు. మహిళలు, వృద్ధులు, యువత, రైతులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఆమెకు హారతులు పట్టి, బ్రహ్మరథం పట్టారు.ఈ సందర్భంగా బిజ్జం ఖాజా కుమారి మాట్లాడుతూ,,గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మన గ్రామాల అభివృద్ధి పూర్తిగా అటకెక్కింది. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్,యువనేత నారా లోకేష్ నాయకత్వంలో సుపరిపాలన నడుస్తోంది” అని అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిగిరి జడ్పీటీసీ అభ్యర్థి మెట్టుకూరు శిరీషా రెడ్డి ని మరియు అనంతపురం ఎంపీటీసీ అభ్యర్థిగా నన్ను (బిజ్జం ఖాజా కుమారి)మా ఇద్దరినీ సైకిల్ గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అని విజ్ఞప్తి చేశారు.ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ నాయకత్వంలో మరింత అభివృద్ధి చేస్తామని, గెలిచిన తర్వాత ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవలో తరిస్తామని ఆమె స్పష్టం చేశారు.ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయన సహకారంతో పాతనాపురం గ్రామంలో పెండింగ్ లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి, గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళా సాధికారత, తాగునీటి కొరత, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని భరోసా ఇచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ , జనసేన, నాయకులు కార్యకర్తలు అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *