
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట పట్టణంలో కూటమి బలపరిచిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) జెడ్పీటీసీ అభ్యర్థి జి. పాలెం తేజోవతిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అభ్యర్థి మద్దతుదారులు, కూటమి నాయకులు విస్తృతస్థాయిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా జోరువానలో నాయకులు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి, కమలం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు రేణిగుంట పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహబూబ్ బాషా, క్లస్టర్ ఇంచార్జ్ డి. పుష్పనాథం, మైనార్టీ నాయకులు 170 భూత్ ఇంచార్జ్ నవాబ్, యువ నాయకులు సాగర్, అంబికా పతి, నెల్లూరు సుబ్రహ్మణ్యం, పూల వెంకటాద్రి యాదవ్ తృత్వంలో ఈ ప్రచార కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
ఈ సందర్భంగా కూటమి నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు 170 భుత్ఇం చార్జ్ నవాబు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, ప్రజలకు అందుతున్న పథకాల లబ్ధిని ప్రతీ ఇంటికీ వివరించారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ద్వారా మరింత వేగంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు.
రేణిగుంట మండలంలో మౌలిక సదుపాయాల కల్పన, యువతకు ఉపాధి అవకాశాలు, రైతు సంక్షేమం, మెరుగైన ఆరోగ్య సేవలు మరియు మహిళా సాధికారత ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. మండలాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కూటమి నిరంతరం శ్రమిస్తుందని స్పష్టం చేశారు.
కమలం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి, జడ్పిటిసి అభ్యర్థి జి. పాలెం తేజోవతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రేణిగుంట ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాన్ని జయప్రదం చేశారు.


