ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి. బాలకృష్ణ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని, సుస్థిర జీవనశైలి, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరుల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు..

ఈ సందర్భంగా డిఎంహెచ్వో డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. ప్రజలందరూ పర్యావరణ హితమైన జీవనశైలిని అలవర్చుకుని, భావితరాలకు పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని ఆయన కోరారు. నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే ఈ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో ఇంధన పొదుపు, నీటి సంరక్షణ, సంప్రదాయ ఆహారం మరియు చిరుధాన్యాల ప్రోత్సాహం, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల వర్గీకరణ వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రామ్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed