తిరుపతి, అక్టోబర్ 31 : తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల పరిశీలకులు శ్రీ ఎమ్. వరప్రసాద్ ఐఏఎస్ శని వారం తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎలక్షన్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎలక్షన్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ మరియు మైక్రో అబ్జర్వర్ నిర్వహణ విధానాన్ని పరిశీలించి, ఎన్నికల ప్రక్రియ నిబంధనల ప్రకారం సజావుగా జరిగేలా చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను, స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *