
భారతదేశ తొలి మహిళా ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు.
తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో దృఢ సంకల్పంతో భారతదేశానికి దిక్సూచిలా ముందుండి సుదీర్ఘకాలం నడిపిన ధీర మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ ని, అదేవిధంగా బాంగ్లాదేశ్ వివాదంలో చాకచక్యంగా వ్యవహరించి సమస్యకు పరిష్కారం చూపిన మహానేత ఇందిరా గాంధీ ని నేడు ఎందరో నాయకులకు ఆదర్శప్రాయం ఇందిరా గారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా, జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ప్రేమసుందరం, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, నాగరాజు, మహేష్, అరుణ్, చరణ్, జోసెఫ్, సారధి, చిరంజీవి,చందు తదితరులు పాల్గొన్నారు.
