​ఏర్పేడు అక్టోబర్ 28.

మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఎంపీటీసీ ఎన్నికల్లో ఏర్పేడు మండలంలో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా అడుగులు వేసింది. పార్టీ అధిష్టానం మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రియతమ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు గత నాలుగు రోజులుగా ఏర్పేడు హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన నామినేషన్లు మరియు స్క్రూటినీ కార్యక్రమాలు అపూర్వ విజయవంతమయ్యాయి.
​ప్రతికూల వాతావరణాన్ని, కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాత్రింబవళ్లు శ్రమించిన ప్రతి ఒక్క టీడీపీ సీనియర్ నాయకుడికి, వివిధ హోదాల్లో ఉన్న ప్రతినిధులకు మరియు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు మరియు అభినందనలు తెలుపుతున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
​కార్యకర్తల శ్రమకు దక్కిన ఫలితం:
మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకంగా 15 స్థానాలను ఏకగ్రీవం చేయడం స్థానిక నాయకులు, కార్యకర్తల అనన్యమైన కృషికి నిదర్శనమని నాగరాజ నాయుడు కొనియాడారు. ఈ విజయం పూర్తిగా పార్టీ శ్రేణులదేనని, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
​మిగిలిన పాతవీరపురం ఎంపీటీసీ స్థానంలో కూడా టీడీపీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏర్పేడు మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసి, భవిష్యత్తులోనూ ఇటువంటి అద్భుతమైన ఫలితాలను సాధించేందుకు శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *