అభివృద్ధికి ఓటేయండి.. 50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

*__తుడా ఛైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతి అక్టోబర్ 28.

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 50వ డివిజన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఊట్ల విష్ణు ప్రియ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ గెలుపును కాంక్షిస్తూ తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి డివిజన్‌లో విస్తృత ప్రచారం నిర్వహించారు.నేరుగా ఓటర్ల గడప తడుతూ, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ దివాకర్ రెడ్డి సాగించిన పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. డివిజన్ పరిధిలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో కూటమి శ్రేణులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని “జై తెలుగుదేశం – జై కూటమి” నినాదాలతో హోరెత్తించారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు ఊట్ల విజయకుమార్ పుష్పవతి యాదవ్ , కూటమి నాయకులు కార్యకర్తలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *