*ప్రజా సేవే లక్ష్యంగా, వింజమూరు అభివృద్ధే ధ్యేయంగా పోటీలోకి యువ నాయకుడు*

*వింజమూరు, అక్టోబర్ 19 (మన ధ్యాస ప్రతినిధి నాగరాజు):*

నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. జడ్పీటీసీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా యువ నాయకుడు, ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న పందిటి అంబేద్కర్ మాదిగ నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఈ సందర్భంగా పందిటి అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ, “రాజకీయం అంటే పదవి కాదు.. బాధ్యత. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిగా ఉంటాను. వింజమూరు మండల అభివృద్ధిని శ్వాసగా తీసుకుని పనిచేస్తాను” అని తెలిపారు.గత కొన్నేళ్లుగా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, యువతకు అండగా నిలుస్తున్న తనకు ప్రజలే బలమని ఆయన అన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు తనకు తెలుసని, వాటి పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.”ప్రజల సమస్యలే నా ఎజెండా. పేద, మధ్య తరగతి ప్రజలకు న్యాయం జరిగేలా, ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తా. కుల, మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని వింజమూరును అభివృద్ధి పథంలో నడిపిస్తా” అని హామీ ఇచ్చారు.తనకు అవకాశం ఇచ్చి, తన గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన వింజమూరు మండల ప్రజలను హృదయపూర్వకంగా కోరారు.ఈ కార్యక్రమంలో ఆయన అనుచరులు, యువ నాయకులు, మద్దతుదారులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు. అంబేద్కర్ నామినేషన్ తో వింజమూరులో ఎన్నికల హీట్ ఒక్కసారిగా పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *