__భేటీలో పాల్గొన్న తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో కూటమి నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కూటమి పార్టీల ముఖ్య నేతలు పాల్గొని ఎన్నికల ప్రచారం, క్షేత్రస్థాయి సమన్వయం పై సుదీర్ఘంగా చర్చించారు.ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరై ఎన్నికల సంసిద్ధత పై దిశానిర్దేశం చేశారు.సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమికి అందించిన చారిత్రాత్మక విజయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించాలని, తిరుపతి నగర అభివృద్ధికి కూటమి అభ్యర్థుల గెలుపు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి , తిరుపతి పార్లమెంట్ స్థానిక ఎన్నికల అబ్జర్వర్ నుకసాని బాలాజీ , తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు , యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ,శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు , తిరుపతి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ , టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ , బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామాంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *