రేణిగుంట, అక్టోబర్ 19:

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 21 తేదీ నుండి అక్టోబర్ 23వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో, నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు మరియు ఎంపీడీవో కార్యాలయ పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం ఈ రోజు అక్టోబర్19 వ తేదీన రేణిగుంట ఎంపీడీవో కార్యాలయం వద్ద సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. జయ చంద్ర మరియు రేణిగుంట రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మంజునాథ రెడ్డి పాల్గొని, రేణిగుంట పంచాయతీ సిబ్బందితో నామినేషన్ల స్వీకరణ సమయంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలు, కార్యాలయ పరిసరాల్లో క్రమశిక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు మరియు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్, పంచాయతీ సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అంశాలపై చర్చించారు.

నామినేషన్ల స్వీకరణ జరిగే మూడు రోజుల పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని పోలీసులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణాన్ని కాపాడుతూ పోలీసులకు సహకరించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *