తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో భాగంగా 3వ రోజు నామినేషన్ కేంద్రాలను జనరల్ అబ్జర్వర్ ఎం.వరప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లను, నామినేషన్ దాఖలు ప్రక్రియను, భద్రతా ఏర్పాట్లను, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాలకు సంబంధించి కమిషనర్ ఎం.జయకృష్ణ వివరించారు.
అబ్జర్వర్ తనిఖీ చేసిన కేంద్రాలు:
- న్యూ మారుతి నగర్ – 22వ వార్డు నామినేషన్ కేంద్రం
- కెనడి నగర్ – 12వ వార్డు నామినేషన్ కేంద్రం
- రైల్వే కాలనీ – 35వ వార్డు నామినేషన్ కేంద్రం
- స్పోర్ట్స్ కాంప్లెక్స్ – 10వ వార్డు నామినేషన్ కేంద్రం
- జీవకోన, సత్యనారాయణపురం – 49, 50 వ వార్డుల నామినేషన్ కేంద్రాలు
- తిరుమల రెడ్డి నగర్ – 1వ వార్డు నామినేషన్ కేంద్రం
- నగరపాలక సంస్థ మేయర్ నామినేషన్ కేంద్రం
ఈ తనిఖీల్లో ఆయన వెంట అదనపు కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, లైజనింగ్ ఆఫీసర్ రాజు, తదితరులు ఉన్నారు.

