పంచాయతీ కార్యదర్శి శ్రీధర్‌ ఆధ్వర్యంలో చర్యలు

రేణిగుంట: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో రేణిగుంటలో అధికారులు చర్యలు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి శ్రీధర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుంచి బహిరంగ ప్రదేశాల్లో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలు, రాజకీయ పార్టీ గుర్తులను పోలి ఉండే చిహ్నాలకు ముసుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీకి అనుకూల ప్రచారం జరగకుండా, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశం. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, అధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వేంకటేష్‌, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *