కూష్మాండ దుర్గ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ మానసా దేవి అమ్మవారు – భక్తులతో కిటకిటలాడిన ఆలయం!*

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు అమ్మవారి విశేష అలంకరణ – పోటెత్తిన భక్తులు!

వరికుంటపాడు, అక్టోబర్ 13, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు:

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరికుంటపాడు మండల పరిధిలోని తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మానసా దేవి అమ్మవారు మూడో రోజు కూష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ముందుగా ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. కూష్మాండ దుర్గ అలంకారంలో అమ్మవారు భక్తులకు కనువిందు చేయడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.భక్తులతో కిటకిటలాడిన ఆలయం:ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపాకటాక్షాలు తమపై ఉండాలని, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు.దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు అమ్మవారి వివిధ అవతారాల అలంకారాలను దర్శించుకునేందుకు భక్తులు అత్యంత ఆసక్తి చూపుతున్నారు.ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తీర్థప్రసాదాలను కూడా అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *