దేవీ నవరాత్రులు, బ్రహ్మోత్సవాల సందర్భంగా పారిశుధ్య కార్మికులు, వలస కార్మికులు, యాత్రికులకు అన్నవితరణ
రేణిగుంట:
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు దేవీ శరన్నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకుని రేణిగుంట రైల్వే స్టేషన్‌లో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. . బి.ఎం.ఎస్ జిల్లా కార్యదర్శి వెంకటాద్రి యాదవ్, ఆధ్వర్యంలో రైల్వే ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికులు, వలస కార్మికులు మరియు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైల్వే యాత్రికులకు భోజనం తాగునీరు పంపిణీ చేశారు.
ఈ సేవా కార్యక్రమంలో జాతీయ కార్మిక సలహా కమిటీ సభ్యులు సీనప్ప, రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తేజోవతి, అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భక్తుల కోసం, సమాజం కోసం అహర్నిశలు శ్రమించే పారిశుధ్య కార్మికులకు, వలస జీవులకు ఇలాంటి పర్వదినాల్లో అన్నదానం చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. రైల్వే ప్రయాణికులు, కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైల్వే యూనియన్ నాయకులు ఓంనాథ రెడ్డి పలువురు రైల్వే ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *