ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వర్చువల్ ప్రారంభం.. నేడు ప్రత్యక్షంగా పనులకు శ్రీకారం.

హాజరైన తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి , తుడా వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు.

శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి లక్ష్యంగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంజూరైన నూతన రహదారుల నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అభివృద్ధి పనులకు వర్చువల్ విధానం ద్వారా శ్రీకారం చుట్టగా,నేడు క్షేత్రస్థాయిలో తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ,తుడా వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు ,శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి , సంయుక్తంగా పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు.
తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ* తుడా పరిధిలోని అన్ని నియోజకవర్గాల సమాన అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టికి అనుగుణంగా, ప్రజా అవసరాలను గుర్తించి శ్రీకాళహస్తి ప్రాంతానికి రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేశామని తెలిపారు.ప్రజాధనం సద్వినియోగం అయ్యేలా, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ: శ్రీకాళహస్తి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ప్రజా రవాణా సౌలభ్యం కోసం, గ్రామీణ-పట్టణ ప్రాంతాల అనుసంధానం మెరుగుపరిచేందుకు నాణ్యమైన రోడ్ల నిర్మాణం అత్యంత ఆవశ్యకమని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో తుడా నిధులతో నియోజకవర్గంలో రోడ్ల రూపురేఖలు మార్చనున్నామని, పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తుడా వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు మాట్లాడుతూ* రోడ్ల నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడా జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, తుడా ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *