ఉచిత కుట్టు శిక్షణ.. ప్రతిభావంతులకు ఉచితంగా కుట్టు మిషన్లు!*

కావలి, అక్టోబర్ 12, మనధ్యాస ప్రతినిధి నాగరాజు.

మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే లక్ష్యంతో వంటేరు వరదా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, సిల్క్ డెవలప్‌మెంట్ కేంద్రం ద్వారా ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా కావలి మండలం బ్రాహ్మణ క్రాకలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని కావలి మాజీ శాసనసభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు మంగళవారం, అక్టోబర్ 13వ తేదీ ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనున్నారు.ఈ శిక్షణా కార్యక్రమంలో ఆసక్తి ఉన్న మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మొదటి విడతలో పేర్లు నమోదు చేసుకున్న మహిళలకు మూడు నెలల పాటు నిపుణులచే కుట్టు శిక్షణ అందించడంతో పాటు, శిక్షణ పూర్తయిన అనంతరం ధ్రువపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.శిక్షణ సమయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని కోరారు.పేర్ల నమోదు కోసం సంప్రదించవలసిన నంబర్లు: 8985715908, 8143118688.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *