కొండాపురంలో ఘనంగా శ్యామ్ ప్రసాద్ వివాహానంతర నలుగు వేడుక

కొండాపురం, అక్టోబర్ 11, మన ధ్యాస ప్రతినిది నాగరాజు

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి హరిజనవాడకు చెందిన యారాం రామారావు (లేట్) – జయలక్ష్మి దంపతుల కుమారుడు శ్యామ్ ప్రసాద్ వివాహానంతర నలుగు కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా *కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత, కొండాపురం మాజీ మండల అధ్యక్షులు చెరుకూరి వెంకటాద్రి నాయుడుఆయన తనయులు చెరుకూరి నవీన్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
*నూతన దంపతులకు శుభాకాంక్షలు:*
ఈ సందర్భంగా చెరుకూరి వెంకటాద్రి నాయుడు  మాట్లాడుతూ, యారాం కుటుంబానికి తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. వధూవరులకు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి తమ ఆశీస్సులు అందజేశారు.అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.
*కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:*
ఈ నలుగు కార్యక్రమంలో కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య, బూత్ ఇన్‌చార్జి చెరుకూరి శేషయ్య, అంబటి సుబ్బారావు, శ్రీను, చెన్నయ్య, మల్లికార్జున, గ్రామ పెద్దలు, యువకులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *