

మన న్యూస్:నిజాంసాగర్, జుక్కల్ పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్లమెంట్ లో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసినివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నియోజకవర్గ ఛైర్మన్ సౌదాగర్ అరవింద్, నాయకులు సంగమేశ్వర్, ఖండేరావు, హనుమాన్లు, విఠల్ తదితరులు పాల్గొన్నారు