తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు, తిరుపతి ఎస్ డి పి ఓ ఎం. భక్తవత్సలం పర్యవేక్షణలో వెస్ట్ పోలీసులు ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహన చోరీ ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
కేసు వివరాలు:
- నిందితులు: ఆరెద్దుల వినోద్ కుమార్ (21 కేసులు), చెర్లోపల్లి గోవిందరాజులు (14 కేసులు), గోవిందస్వామి మురళి (17 కేసులు).
- రికవరీ: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ₹25 లక్షల విలువైన 24 ద్విచక్ర వాహనాలు రికవరీ చేయబడ్డాయి. వీటిలో 9 వాహనాలకు సంబంధించిన క్రైమ్ నంబర్లు గుర్తించగా, మిగిలిన 15 వాహనాల యజమానుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
వాహనదారులు తమ బైక్లను సురక్షిత ప్రాంతాల్లో లాక్ చేసి పార్క్ చేయాలని, అనుమానాస్పద కదలికలు ఉంటే డయల్ 112 కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన వెస్ట్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్ఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
