తవణంపల్లి, అక్టోబరు 2 – మన ద్యాస(నాగరాజ సరకింటి)
తవణంపల్లి మండలం నారసింహనపల్లి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు డి ఎస్ పి జె. వెంకట నారాయణ, చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, తవణంపల్లి ఎస్ ఐతో పాటు పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింక్‌ల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. అలాగే బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టం గురించి వివరించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. త్వరలో జరగనున్న సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు.ప్రజల భద్రత, చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు పోలీసు శాఖ తరఫున ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *