​ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రజాసేవను పురస్కరించుకుని చేపట్టిన ‘సేవా సంకల్ప్ బైక్ యాత్ర’ బృందానికి శ్రీకాళహస్తిలో ఘన స్వాగతం పలికిన స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల ఆదేశాల మేరకు ఎన్డీయే కూటమి, తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్ సంయుక్తంగా తిరుపతి అలిపిరి నుంచి కాశీ (వారణాసి) వరకు ఈ చారిత్రాత్మక యాత్రను నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ వద్దకు చేరుకున్న యాత్ర బృందానికి స్వాగతం పలికి, స్వయంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం, తీర్థప్రసాదాలు మరియు భోజన వసతి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దేశ ప్రగతిని, వికాసాన్ని మరియు ఐక్యతను చాటిచెప్పేలా యువత చేపట్టిన ఈ మహా యాత్ర పరమశివుడి దివ్య ఆశీస్సులతో అత్యంత విజయవంతంగా, సురక్షితంగా సాగాలని ఆకాంక్షిస్తూ, యువ సోదరులను ఆత్మీయంగా సత్కరించి యాత్రకు వీడ్కోలు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *