​మేయర్ పీఠానికి రోస్టర్ విధానం అమలు చేయాలి.. దళిత సంఘాల తీవ్ర హెచ్చరిక..తాళ్లపాక దాము డిమాండ్.

తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికలలో భారత రాజ్యాంగబద్ధంగా ప్రవేశపెట్టిన రొటేషన్ లేదా రోస్టర్ విధానము తిరుపతి మేయర్ పదవికి మాత్రం రొటేషన్ లేదా రోస్టర్ విధానము పాటించడం లేదని భారత రాజ్యాంగ విరుద్ధ ప్రక్రియలో తిరుపతి మేయర్ పదవి ఎస్సీ ఎస్టీలకు దక్కకుండా ఉద్దేశపూర్వక కుట్రలు జరుగుతుందని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపాక దాము అన్నగారు ఆరోపించారు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కచ్చితంగా కార్పెట్ స్థాయి నుంచి మేయర్ పీఠం వరకు రొటేషన్ లేదా రోస్టర్ విధానము సక్రమంగా పాటించి ప్రజలకు న్యాయం జరగాలని దీనితోపాటే ఎస్సీ ఎస్టీ రావాల్సిన రిజర్వేషన్ ప్రకారం కార్పొరేటర్ లను పెంచాలని డిమాండ్ చేశారు తిరుపతి మేయర్ పదవిని ఎస్సీ రిజర్వుడు చేయకపోతే చట్టబద్ధమైన ప్రణాళికలు సిద్ధం చేసి కోర్టుకెళ్లి తేల్చుకుంటామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో తెలిపారు జై భీమ్ సేన రాష్ట్ర వ్యవస్థాపకులు అధ్యక్షులు పవర్ పి రామచంద్రన్ మాట్లాడుతూ తిరుపతి మేయర్ పదవికి కచ్చితంగా భారత రాజ్యాంగబద్ధంగా రొటేషన్ లేదా రోస్టర్ విధానాన్ని పాటించాలని 2026 జనవరి జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కార్పొరేటర్ లను పెంచాలని కచ్చితంగా మేయర్ పదవిని కూడా 100% ఎస్సీలకు చేయాలని డిమాండ్ చేశారు స్వాతంత్రం వచ్చ 79 సంవత్సరములు కావస్తున్న ఇప్పటివరకు తిరుపతి మేయర్ పదవిని ఎందుకు ఎస్సీ రిజర్వాడ్ చేయలేదని ప్రశ్నించారు భారత రాజ్యాంగ ఎన్నికల వ్యవస్థ తోపాటు రొటేషన్ రోస్టర్ విధానాన్ని కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో న్యాయబద్ధమైన శాంతియుత దీక్షలు అమరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ నేషనల్ ఎంప్లాయిస్ యూనియన్ నేషనల్ నాయకుడు దుగ్గిరాల జయరాం భూపాల్ ప్రవీణ్ మురళి మధుబాబు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *