మన ధ్యాస, నెల్లూరు సెప్టెంబర్ 26 : నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం పొదలకూరు మండలం, తోడేరు గ్రామం చెందిన పుట్టం ఈశ్వరయ్య మీడియా సమావేశం నిర్వహించినారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…… నాది నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలము, తోడెరు గ్రామం… నేను ఎస్టి కులస్తులకు చెందిన వాడిని నా తండ్రి పుట్టం. మునెయ్య . మా తాతల కాలం నుంచి నా తండ్రి పుట్టం. మునెయ్య 1.76 సెంట్లు సాగు చేస్తూ మా తండ్రి తదనంతరము నేను మెట్ట పొలములో జొన్న, మాగణి లో వరి సాగు చేయుచున్నాను అని అన్నారు.నేను ఉద్యోగ రీత్యా వెంకటాచలం ఎస్బిఐ లో టెంపరరీ మెసెంజరుగా పని చేస్తు ఉండినాను. 2003 సం||ము నాకు పక్షవాతము వచ్చినందువలన ఆరోగ్యము చూపించుకొనుటకు నెల్లూరు లోని 3వ మైలుకు వచ్చినాను, నేను పని మానేసి నేను నా ఆరోగ్యము చూపించుకుంటున్నాను అని తెలిపారు.నేను ప్రభుత్వం వారు కల్పించిన రైతు భరోసా చేసినాను.. రైతు భరోసా లో నా మాగాణి 33 సెంట్లు కనిపిస్తుంది. నాకు రైతు భరోసా గత 2సం|| నుండి లబ్దిపొందు తున్నాను… నాకు 1.43 సెంట్లు లకు 1 బి రావడం లేదు. అప్పటివరకు నాకు 1.76 సెంట్లు ఉందని అనుకొంటున్నాను ఇప్పుడు 1.43 సెంట్లుగా 1 బి లో రావడం లేదు అని అన్నారు.ఈ విషయము కలెక్టర్ కి అర్జీ ఇచ్చి నందువలన పొదలకూరు మండల సర్వేయర్ ని పంపినారు. నేను సర్వేయర్ ని కలవగా, నీకు 33 సెంట్లు మాగాణి ఉంది, మెట్ట 1.43 సెంట్లు 287/7 సర్వే నెంబరు మార్చినారు అని తెలియజేసినారు.నేను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ని కలిసినాను, ఆయన తక్షణమే స్పందించి ఆర్డీవో ని కలవమన్నారు. ఆర్డీవో పొదలకూరు ఎమ్మార్వో ని, వీఆర్వో ని, కలవమన్నారు. నేను పోయి కలిసినాను కాని స్పందన లేదు అని అన్నారు. అనారోగ్య పరిస్థితుల కారణంగా తిరగలేక మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియపరచి నాకు న్యాయము చేయగలరని కోరుతున్నాను అని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *