​గాజులమండ్యం పోలీసుల చర్య.

​రేణిగుంట సెప్టెంబర్ 26. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, డిఎస్పీ (ఎస్డిపిఓ) శ్రీనివాసరావు పర్యవేక్షణలో, రేణిగుంట రూరల్ సిఐ ఎం. మంజునాథ రెడ్డి, ఎస్ఐ హరీష మరియు సిబ్బంది బృందం సెప్టెంబర్ 26 న దామినేడు కూడలి వద్ద ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. సెప్టెంబర్ 24 ర్రాత్రి మద్యం తాగిన నిందితులు, ఒంటరిగా వెళ్లే ప్రయాణికుడిని తమ ఆటోలో ఎక్కించుకుని తిరుపతి-పుత్తూరు మార్గంలోని తూకివాకం చెరువు దగ్గర చీకటిగా ఉన్న ప్రాంతంలో ఆపారు. ప్రయాణికుడిపై దాడి చేసి బెదిరించి, అతడి దగ్గర ఉన్న రూ. 500 నగదు, రూ. 10,000 విలువైన ఫోన్‌ను గుంజుకున్నారు. ఈ నేరంలో ఇంకో నిందితుడు వేరే ఆటోలో వెనుక వస్తూ వీరికి సాయం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్. జయ కుమార్ అలియాస్ స్వామి (43), జరుపాల్ హన్మంతు అలియాస్ తెలుగు రవి (27), సుంకర మోహిత్ సాయి (21) అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి దొంగిలించిన ఫోన్ మరియు దొంగతనానికి వాడిన రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వీరిలో మొదటి ఇద్దరిపై గతంలో 12 చొప్పున పాత కేసులు, మూడో వ్యక్తిపై 2 కేసులు ఉన్నాయి. రాత్రి పూట ఒంటరిగా వెళ్లేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనుమానంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు చెప్పాలని గాజులమండ్యం పోలీసులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *