నిజాంసాగర్, సెప్టెంబర్ 25 (మన న్యూస్): మద్నూర్ మండలంలోని మేనూరు మోడల్ పాఠశాలలో హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులకు పుల్కల్ గ్రామానికి చెందిన గొట్టం సాయిలు తన కుమార్తె అభిగ్న్య జన్మదినాన్ని పురస్కరించుకుని గొట్టం సాయిలు,మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ నర్సగౌడ్, గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ చేతుల మీదుగా విద్యార్థులకు భోజన ప్లేట్లను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గొట్టం సాయిలు తన కుమార్తె అభిగ్న్య పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడేలా భోజన ప్లేట్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను అందించడం మంచి ఆలోచన అని పేర్కొన్నారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.
విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్లేట్లను అందజేసిన గొట్టం సాయిలును పాఠశాల సిబ్బంది, హాస్టల్ నిర్వాహకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్మారుతి, జైన్,అనిల్,హాస్టల్ వార్డెన్ కవిత,ఏఎన్‌ఎం శారద తదితరులు పాల్గొన్నారు.