తిరుపతి సెప్టెంబర్ 25.
తిరుమల తిరుపతి దేవస్థానములు ఆధ్వర్యంలోని బర్డ్ ట్రస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల అత్యవసర వైద్య సేవల నిమిత్తం తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌కు చెందిన ‘యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్’ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.
ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ సభ్యులు:

ఎస్. బాలచందర్బి. రామ్‌ప్రసాద్ భాను ప్రకాష్ఎం. లక్ష్మణ్,ఎ.టి. భరత్
రోగుల ప్రాణ రక్షణ కోసం రక్తదానం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. రక్తదానం చేసిన సభ్యులకు ఆసుపత్రి యాజమాన్యం ప్రశంసా పత్రాలను అందజేసింది.తోటి మానవుల ప్రాణాలను కాపాడేందుకు మహబూబ్‌నగర్ నుండి వచ్చి ఇక్కడ రక్తదానం చేసిన సభ్యులను ‘యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్’ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు పసేలి రాజేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఆపదలో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణదాతలుగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *