తిరుపతి జిల్లా….
రేణిగుంట మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో రవిచంద్ర, డిప్యూటీ ఎంపీడీవోలు ప్రభురావు, కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హకాలపాటి హరిప్రసాద్,రెడ్డి జడ్పీటీసీ సంధ్యారాణి, వైస్ ఎంపీపీ సుజాతలతో పాటు మండలంలోని ఎంపీటీసీలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి సత్కరించి వీడ్కోలు పలికారు.
అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించిన ఎంపీపీ హరిప్రసాద్…
ఈ సందర్భంగా ఎంపీపీ కాలాపాటి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… గత ఐదేళ్ల వైయస్సార్సీపీ హయాంలో మండల వ్యాప్తంగా 8,64,30,580 కోట్ల రూ. అభివృద్ధి ప్రస్థానాన్ని తెలియజేశారు. మాకు సహాయ సహకారాలు అందించిన ఆదిశేషారెడ్డి, హరిబాబు, రత్నమ్మ, విష్ణు చిరంజీవి, ప్రభురావు రవిచంద్ర లాంటి అధికారుల సమన్వయంతోనే మండలాభివృద్ధి సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతులు, మరియు సచివాలయాల ద్వారా సంక్షేమ ప్రతి ఫలాలను అర్హులందరికీ పారదర్శకంగా అందించామని స్పష్టం చేశారు. కులం మతం ప్రాంతం పార్టీ చూడలేదని అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
జడ్పీటీసీ సంధ్యారాణి మాట్లాడుతూ…..
అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మండల ఇన్చార్జి బియ్యపు పవిత్ర రెడ్డి సహాయ సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టామని ఆమె తెలిపారు.
వైస్ ఎంపీపీ సుజాత వీడ్కోలు సభలో మాట్లాడుతూ….
కూటమి ప్రభుత్వ పని తీరుపై స్పందిస్తూ పేదల పెన్షన్ల తొలగింపు అంశాన్ని వీడ్కోలు సభలో ఆమె ప్రస్తావించారు. హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ పేరుతో పెన్షన్లకు కోత విధిస్తున్నారని ఆమె వాపోయారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డి, శ్రీ పవిత్ర రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ గంగారి రమేష్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, స్థానిక నా నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

