కావలి, సెప్టెంబర్ 21, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి నివాసంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథికి ఘన సత్కారం లభించింది. ఎమ్మెల్యే శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి మంత్రికి ఆత్మీయంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి, ఎమ్మెల్యే కీలక చర్చలు జరిపారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్లో చేపట్టాల్సిన పనులపై విస్తృతంగా సమాలోచన చేశారు.ముఖ్యంగా రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, రహదారి పనుల వేగవంతంపై చర్చించారు.అలాగే ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సమీక్షించారు.ఈ భేటీలో ఎమ్మెల్యే కావలి నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలను మంత్రి పార్థసారథికి పరిచయం చేశారు. మంత్రి వారితో ఆత్మీయంగా ముచ్చటించారు.మొత్తంగా కావలి అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండాగా జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
