వెంకటపతి నగర్ పంచాయతీ పరిధిలోని తాటితోపు లో నిర్వహించిన వినాయక నిమజ్జన మహోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలు, కోలాహలం నడుమ ఘనంగా జరిగాయి.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

కార్యక్రమంలో భాగంగా ఆయన వినాయక ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి సమర్పించారు. అనంతరం స్థానిక భక్తులు, యువతతో కలిసి నిమజ్జన శోభాయాత్ర లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని స్థానిక యువత, ఉత్సవ నిర్వాహకులు,మహిళలు మంగళ హారతి,శాలువాతో ఘనంగా సన్మానించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు మరియు మహిళలు పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *