మాస్ట‌ర్ ఫ్లాన్ రోడ్ల బాధితుల‌కు త్వ‌ర‌లో టిడిఆర్ బాండ్లుః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్:తిరుప‌తి,మాస్ట‌ర్ ఫ్లాన్ రోడ్డుల కార‌ణంగా భూమి కోల్పోయిన అర్హుల‌కు ఫిబ్ర‌వ‌రి నాటికి టిడిఆర్ బాండ్లు మంజూరైయ్యేలా చూస్తామ‌ని ఎమ్మ‌ల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే త‌మ సొంత భూముల విలువ పెంచుకునేందుకు మాస్ట‌ర్ ఫ్లాన్ రోడ్డుల పేరిట నిధులు దోచుకున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. తిమ్మినాయుడుపాలెం ప‌రిధిలోని తిరుమ‌లరెడ్డిన‌గ‌ర్ స‌చివాల‌యం ఆవర‌ణ‌లో రెవెన్యూ స‌ద‌స్సు సోమ‌వారం ఉద‌యం జ‌రిగింది. ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసుల‌తోపాటు త‌హ‌శిల్దార్ భాగ్య‌ల‌క్ష్మీ పాల్గొన్నారు. 50వ డివిజ‌న్ కు సంబంధించిన రెవెన్యూ స‌మ‌స్య‌ల‌ను తెలుగుదేశం, జ‌న‌సేన నాయ‌కులు స‌ద‌స్సు దృష్టికి తీసుకొచ్చారు. గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన అక్ర‌మాల ప్ర‌క్షాళ‌న‌ను తిరుమ‌ల నుంచే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్రారంభించార‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. మాస్ట‌ర్ ఫ్లాన్ రోడ్డ‌ల పేరుతో మాజీ ఎమ్మెల్యే రేట్లు పెంచుకుని త‌న‌కు కావాల్సిన వారికి మాత్ర‌మే టిడిఆర్ బాండ్లు జారీ చేసి దోచుకున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. టిడిఆర్ బాండ్ల కుంభ‌కోణంపై ప్ర‌భుత్వం విజిలెన్స్ విచార‌ణ జ‌రిపిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. మాస్ట‌ర్ ఫ్లాన్ రోడ్లు కార‌ణంగా భూమి కోల్పోయిన వారికి ఫిబ్ర‌వ‌రి నాటికి టిడిఆర్ బాండ్లు అందించినున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. తిమ్మినాయుడుపాలెం హ‌రిజ‌న‌వాడ స్మ‌శాన వాటిక స‌మ‌స్య పరిష్కారానికి అట‌వీ భూమికి ప్ర‌త్యామ్మాయ భూమి ఇచ్చే ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌భుత్వం పరిశీలిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 22ఏ స‌మ‌స్య ను ప‌రిష్క‌రించేందుకు రెవెన్యూ అధికారులు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని ఆయ‌న కోరారు. పాన్ చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి పార్ల‌మెంట్ అధ్య‌క్షులు న‌ర‌సింహ యాద‌వ్, క్ల‌స్ట‌ర్ ఇన్చార్జీలు బిజి కృష్ణ‌యాద‌వ్, పులుగోరు ముర‌ళీ, శ్రీధ‌ర్ వ‌ర్మ‌, వెంక‌ట‌ర‌త్నం, మ‌న్యం శ్రీనివాసులు, కార్పోరేట‌ర్లు అనిల్, రాధా రెడ్డి, అన్నా అనిత‌, వ‌రికుంట్ల నారాయ‌ణ‌, జ‌న‌సేన న‌గర అధ్య‌క్షులు రాజా రెడ్డి, సుభాషిణి, బాబ్జీ,వంశీ, మ‌ధుల‌త‌, రాధా, చంద‌న‌, బ‌ద్రీ, నైనార్ శ్రీనివాసులు, హేమ‌కుమార్, కెఎంకే లోకేష్, ప‌గ‌డాల ముర‌ళీ, పుట్టా ఆనంద్, వినోద్, లోకేష్, ఆముదాల తుల‌సి త‌దిత‌రులు

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా