కలిగిరి , సెప్టెంబర్ 18, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

కలిగిరి మండలం దుబగుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన తలపల రామారావు (45) శనివారం ఉదయం పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికుల కథనం ప్రకారం… శనివారం ఉదయం వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా, రామారావు పిడుగుపాటుకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతుడి కుటుంబం పేదరికంలో ఉందని, కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో వారు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారని గ్రామస్తులు తెలిపారు.కాబట్టి స్థానిక నాయకులు, అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం నుండి రావాల్సిన పరిహారం త్వరితగతిన అందించాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *