తవణంపల్లె, సెప్టెంబర్ 11 మన ద్యాస (నాగరాజ సరకింటి )

వినాయకచవితి పండుగ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో గణేష్ మండ పాల ఏర్పాటు చేసే నిర్వహకులు ఖచ్చి తంగా నిబంధలను పాటించాలని స్థానిక ఎస్సై జి.రమేష్ బాబు తెలిపారు. శుక్ర వారం స్థానిక పోలీస్ స్టేషన్లో గణేష్ ఉత్సవాల నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు నిర్వహించే నిర్వహకులు మండపాల ఏర్పాటులో ప్రభుత్వం విధించిన నిబంధలను విధిగా పాటించాలన్నారు. వినయకచవితి ఉత్సవాలను నిమజ్జన శాంతియుతంగా, సురక్షితంగా మత సామం “స్యంతోట్రాఫిక్కుఅంతరాయంలేకుండా నిర్వహించాలన్నారు. అన్ని విగ్రహాలను వీలైనంత త్వరగా సాధ్యమై నంతవరకు చీకటి పడకముందే నిమజ్జన ప్రదేశానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *