మన ధ్యాస, నెల్లూరు, సెప్టెంబర్ 11 : నెల్లూరు నగరం, ట్రంక్ రోడ్డు శివాజీ సెంటర్ సమీపంలో ఉన్న వెంకట్రామ అండ్ కో పాఠశాలలకు చెందిన విద్యార్థులకు శుక్రవారం మట్టి గణపతి ప్రతిమ లను పంపిణీ చేశారు. శ్రీవేంకట్రామ అండ్ కో, శ్రీశ్రీ ఏజెన్సీస్ అధినేత శ్రీపతి శ్రీనివాసరావు, ఆం ధ్రప్రదేశ్ పేపర్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిం చారు. ముఖ్యఅతిథులుగా జిల్లా పంచాయతీ అధికారి బీకేఎస్ వెంకటరమణ, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ మస్తాన్రెడ్డి, ప్రముఖ న్యాయవా ది, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మలి రెడ్డి కోటారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ…. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని సూచిం చారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ వినాయకచ వితి సందర్భంగా 9 వేల మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రముఖ న్యాయవాది మలి రెడ్డి కోటారెడ్డి మాట్లాడుతూ…..పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుని బొమ్మలని పూజించండి….పర్యావరణ కాపాడండి తెలిపారు. గత 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మట్టి వినాయకుని బొమ్మలను పంపిణీ చేస్తున్న శ్రీపతి శ్రీనివాసరావు ను అభినందించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *