మన ధ్యాస ,నిజాంసాగర్‌: ( జుక్కల్ ) సెప్టెంబర్ 7 ,కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు. హామీల అమలును డిమాండ్‌ చేస్తూ వారం రోజులుగా నిర్వహిస్తున్న నిరసనల్లో భాగంగా సోమవారం నిజాంసాగర్‌లో పలు కార్యక్రమాలు చేపట్టారు.
మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, సీడీసీ మాజీ చైర్మన్‌ పట్లోళ్ల దుర్గారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, లబ్ధిదారులు పాల్గొని ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కోరుతూ ఎంపీడీవో శివకృష్ణ, తహసీల్దార్‌ సాయిబుజంగారావులకు దరఖాస్తులు అందజేశారు. పింఛన్ల పెంపుతో పాటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 అందించాలని డిమాండ్‌ చేశారు.అనంతరం పాత బస్టాండ్‌ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ మనోహర్‌, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రమేష్‌గౌడ్‌, నాయకులు ఆనంద్‌కుమార్‌, అంజయ్య, విజయ్‌కుమార్‌, రాజు, లింగగౌడ్‌, విఠల్ గౌడ్‌, గోరేమియా, పండరి, శ్రీకాంత్‌రెడ్డి,తదితరులు ఉన్నారు.

మహమ్మద్ నగర్
మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజావాణిలో తహసీల్దార్ లతా, ఎంపీడీవో అనితకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రజా వారిలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సాదుల సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ,నాయకులు దఫెదర్ విజయ్ ,మహేందర్ ,రాం చందర్ , శ్రీధర్ రెడ్డి,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *