మన ధ్యాస, సెప్టెంబర్ 6,నిజాంసాగర్ ,(జుక్కల్ )మహమ్మద్‌నగర్‌: మండలంలోని తునికి పల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్‌ దఫెదర్‌ రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు, అభివృద్ధి పనులను పరిశీలించి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించి, నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.
దఫెదర్‌ రాజు మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సాదుల సత్యనారాయణ, మాజీ సి డి సి చైర్మన్ గంగారెడ్డి, గుణ్కుల్ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, మాజీ సర్పంచులు పున్న నారాయణ,లక్ష్మారెడ్డి,నాయకులు మనీష్ రెడ్డి,అమెర్,రాంచందర్,విఠల్, తదితరులు ఉన్నారు

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *