మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) సెప్టెంబర్ 5 ,
భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు,నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ముఖ్య అతిథిగా హాజరై మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన
కె. బాలప్రసాద్, బి. జోసెఫ్ రత్నకాంత్, టి. సంగమిత్ర, ఆర్. రమాదేవి, ఏ. లక్ష్మణ్ గౌడ్, ఐ. బాలరాజు, కె. రమాదేవి, జే. రాజులను శాలువా పూలమాలతో మెమోరండం ఇచ్చి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని, విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణను నేర్పి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
ప్రస్తుత సమాజంలో విద్యార్థులపై వివిధ రకాల చెడు ప్రభావాలు పడుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు వారికి ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణను కల్పించాలని కోరారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రతి ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్ , ఎంఈఓ తిరుపతిరెడ్డి ,ఎంపీడీవో శివకృష్ణ,నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పండరి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మయ్య, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సంతోష్ కుమార్, పీఆర్టీయూ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, ఉపాధ్యాయులు వెంకటేశం,సర్పంచులు బొజ్జ అంజయ్య, సాతెల్లి పోచయ్య, వడ్ల బ్రహ్మం,మోహన్,తదితరులు ఉన్నారు.
