మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 5: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య సూచించారు. శనివారం పిట్లం వైశ్య భవన్‌లో సీఐ తిరుపయ్య, ఎస్‌ఐ అంజనేయులు ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల శాంతి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గణేష్ మండపాల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, సౌండ్ సిస్టమ్ వినియోగం, ఊరేగింపు, నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలను పాటించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా సౌండ్ సిస్టమ్‌ను వినియోగించరాదని తెలిపారు. ఊరేగింపు, నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.ఉత్సవాల సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తినా, అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరారు. గణేష్ ఉత్సవాలను అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా నిర్వహించి పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఈ సమావేశంలో సర్పంచ్ శేఖర్, ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.