తవణంపల్లి, ఆగస్టు 15 — మన ద్యాస (నాగరాజ సరకింటి)

తవణంపల్లి మండల పోలీస్ స్టేషన్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.ఈ సందర్భంగా ఎస్సై రమేష్ బాబు ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. పాఠశాల విద్యార్థులతో జాతీయ గీతాన్ని ఆలపింపజేసి, అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్సై రమేష్ బాబు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాలు, దేశభక్తి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.దేశస్వాతంత్ర్యం, సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. దేశభక్తి భావాన్ని ప్రతి ఒక్కరిలో పెంపొందించుకోవాలని, స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తవణంపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *