ఏర్పేడు ఆగష్టు 15.
తిరుపతి జిల్లా ఏర్పేడు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఎంతో ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో మండల టీడీపీ మండల అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు మాట్లాడుతూ— “దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలు వెలకట్టలేనివి. రాబోవు రోజుల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలందరి భాగస్వామ్యంతో మరింత వైభవంగా నిర్వహించాలి” అని పేర్కొన్నారు.
అనంతరం వేడుకల్లో పాల్గొన్న పలువురు పెద్దలు మాట్లాడుతూ అమరవీరుల ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పేరం ధనంజయులు నాయుడు, ఎంపీపీ ఆదిలక్ష్మి, నాయకులు నైనూరు పున్నారావు, గాలి కృష్ణవేణి, మహేష్ రెడ్డి, కేకే రమణ, గుణా యాదవ్, రామిశెట్టి కిరణ్ రాయల్, వై. మనోహర్ నాయుడులతో పాటు తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీడీవో సౌభాగ్యమ్మ, ఏపీఎం ఆదినారాయణ, ఏపీఓ సుజాత మరియు మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
