అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభలో గురవరాజుపల్లి…
అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి…బీజేపీ నాయకుడు తేనెపల్లి రవి.
రెండు రోజుల పాటు కోలాహలంగా అమ్మవారి ఉత్సవాలు..
రేణిగుంట ఆగష్టు 12.
రేణిగుంట మండలం, గురవరాజుపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామంలో శ్రీ అంకాల పరమేశ్వరి దేవి జాతర మహోత్సవాలు రెండు రోజుల పాటు అత్యంత అంగరంగ వైభవంగా సాగాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం నాటి కార్యక్రమానికి రేణిగుంట మండలం బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు తేనెపల్లి రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కొండపాకం మునికృష్ణ పర్యవేక్షణలో ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా తేనెపల్లి రవిని శాలువాతో సత్కరించి, అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించిన అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తేనెపల్లి రవి మాట్లాడుతూ.. శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై సదా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రామంలో జాతర వాతావరణం భక్తిశ్రద్ధలతో మిళితమై అలరించడం అభినందనీయమన్నారు.
ఈ వేడుకల్లో క్లస్టర్ ఇన్చార్జ్ నారాయణ, బూత్ కన్వీనర్ నిరంజన్, నాయకులు పుల్లంపల్లి వెంకట ముని, నారగంటి ముని కృష్ణ, లక్కీ గోపి, శాలివాహన ఆర్గనైజర్ భాస్కర్, పార్థు, ఉదయ్, నాగరాజు (టైగర్) తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు
